: తనపై సోషల్ మీడియాలో వస్తోన్న పోస్టుల పట్ల భగ్గుమన్న ఎమ్మెల్యే రోజా!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు ర‌కాల పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమె కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారంటూ మార్ఫింగ్‌ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై రోజా స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన రాజకీయ శత్రువులే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. తాను మ‌ర‌ణించిన‌ట్లు ఫొటోలు పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అసెంబ్లీలో దీక్ష సమయంలో తాను ఆసుప‌త్రిలో ఉన్న ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారని అన్నారు.     

  • Loading...

More Telugu News