: కేరళలో 100కి పైగా థియేటర్లలో విడుదల కానున్న అల్లు అర్జున్ సినిమా!
`దువ్వాడ జగన్నాథం` సినిమా మలయాళంలో `ధ్రువరాజ జగన్నాథం`గా అనువాదమైంది. కేరళలో అల్లు అర్జున్ అభిమానగణం ఎక్కువగా ఉండటంతో అక్కడ 100కి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే రోజు (ఆగస్టు 11)న అక్షయ్ కుమార్ `టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా`, ధనుష్ `విఐపీ 2` సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. వీటితో పోల్చినపుడు అల్లు అర్జున్ సినిమాకే భారీ ఓపెనింగ్స్ వస్తాయని మాలీవుడ్ సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
`ధ్రువరాజ జగన్నాథం` సినిమాను ఉదయం 7గం.లకే ప్రత్యేక షోలు కూడా వేస్తున్నారంటే అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గతంలో `యోధవు` పేరుతో విడుదలైన `సరైనోడు` సినిమాకు కూడా కేరళలో మంచి కలెక్షన్లు వచ్చాయి.