: రాజకీయాల్లో ఉన్న `3సీ`లు వెళ్లిపోయి `4సీ`లు రావాలి: వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన దగ్గరి నుంచి వెంకయ్యనాయుడు మాటతీరులో కాస్త తేడా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ శైలిలో తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు అబ్దుల్ కలాం, ఇండియా పదాలకు తనదైన శైలిలో అర్థం చెప్పిన ఆయన కొత్తగా రాజకీయాల గురించి కూడా ఒక నిర్వచనం ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో `3సీ`లు (క్యాష్, క్యాస్ట్, కమ్యూనిటీ) ఉన్నాయని, ఇవి తొలగిపోయి `4సీ`లు (క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కండక్ట్) రావాలని ఆయన అన్నారు.