: వినియోగదారులకు మరో సదుపాయం కల్పించనున్న వాట్సాప్


ఈ రోజుల్లో వాట్సాప్ తో అనుసంధానం కాని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాలకు దగ్గరైంది వాట్సాప్. తన వినియోగదారులను నిరంతరం ఏదో ఒక కొత్త ఫీచర్ ను అందించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా, తన కస్టమర్లకు మరో అద్భుతమైన సదుపాయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే, 'ఇన్ స్టంట్ మనీ ట్రాన్స్ ఫర్' ఫీచర్ ను ప్రవేశపెట్టబోతోంది. దీని ద్వారా వినియోగదారులు డబ్బును పంపుకునే వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ ను ఉపయోగించుకోవాలంటే... 'వాట్స్ యాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ టెర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ'ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.


  • Loading...

More Telugu News