: వోగ్ అవార్డ్స్ కార్యక్రమంలో అత్త ఐశ్వర్యతో నవ్య!
ముంబైలో తాజాగా ‘వోగ్’ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కబడ్డీ లీగ్ జరగుతున్న కారణంగా అభిషేక్ బచ్చన్ హాజరుకాలేదు. అయితే ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా ఐశ్వర్యారాయ్, ఆమె మేన కోడలు (అమితాబ్ కూతురు కూతురు) నవ్య నవేలీ నందా నిలిచారు. ఐశ్వర్యారాయ్ ఎప్పట్లాగే స్పెషల్ గా కనిపించగా, అత్తకు తగ్గ మేనకోడలిలా నవ్య కూడా ఆకట్టుకుంది. అందరి చూపూ వీరిపైనే నిలిచింది.
స్కై బ్లూ గౌనులో మెరిసిపోయిన నవ్యపై బాలీవుడ్ కన్నుపడింది. కాగా, సాధారణంగా బయట జరిగే ఈవెంట్లకు నవ్య హాజరుకాదు. అయితే కుటుంబం మొత్తం హాజరుకావడంతో వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొందని, వీరిద్దరినీ చూసినవారు మేనత్త కోడళ్లలా లేరని, అక్కా చెల్లెళ్లలా ఉన్నారని గుసగుసలాడుకున్నారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో నవ్య పోస్టు చేసింది. ఈ ఫోటోకు అభిమానుల ఆదరణ లభిస్తోంది. ఈ ఫోటోను మీరు కూడా చూడండి.