: డ్రగ్స్ పెడ్లర్ గాబ్రియెల్ అరెస్టు.. సంగీత కేసులో కీలక వ్యక్తి అతనే!


డ్రగ్ రాకెట్ లో కీలక నిందితుడు గాబ్రియెల్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని కౌకూరులోని ఒక అపార్ట్ మెంట్ లో గాబ్రియెల్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గాబ్రియెల్ నుంచి కొకైన్, ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన సంగీత తొలుత ఒజుకు కాస్మోస్ తో కలిసి సహజీవనం చేస్తూ డ్రగ్స్ దందా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైదరాబాదులో కొంత కాలం గాబ్రియల్ తో కలిసి సహజీవనం ఉంటూ దందా చేసిందని, ఆ తరువాత మళ్లీ ఒజుకు కాస్మోస్ తో సహజీవనం ప్రారంభించిందని పోలీసులు విచారణలో గుర్తించారని వార్తలొచ్చాయి.

ఈ కేసులో గాబ్రియెల్ చాలా కీలకమైన వ్యక్తి అని, అతనిని పట్టుకుంటే కీలకమైన వివరాలు సేకరించవచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడ్డారు. గతంలో ఈస్ట్‌ మారేడ్‌పల్లి పోలీసులకు 20 గ్రాముల కొకైన్‌ తో చిక్కిన గాబ్రియెల్‌ బెయిల్ తీసుకున్న తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బ్రౌన్‌ షుగర్‌, కొకైన్‌, ఎంపిటమైన్‌ వంటి డ్రగ్స్ ను డ్రగ్ మాఫియా నుంచి తీసుకొచ్చి హైదరాబాదుకు గాబ్రియెల్ సరఫరా చేసేవాడని సిట్ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌకనూరులోని అపార్ట్ మెంట్ లో గాబ్రియెల్ ను పట్టుకోవడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News