: చైనా హ్యాక‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధంగా లేదు: నిపుణుల హెచ్చరిక


భార‌త్‌, చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ దేశం నుంచి ఎదుర‌య్యే అన్ని స‌మ‌స్య‌ల‌పై భార‌త నిపుణులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. భారత కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై చైనా హ్యాకర్లు దాడిచేస్తే? వారి దాడిని ఎదుర్కునేదెలా? అనే అంశంపై సైబర్‌ భద్రతా నిపుణులు రాహుల్‌ త్యాగి స్పందిస్తూ... చైనా హ్యాక‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధంగా లేదని అన్నారు.

 భార‌త‌ ప్రభుత్వ సంస్థలు సులభంగా టార్గెట్‌ అవుతాయని తెలిపారు. ఆ దాడులను మన వ్య‌వ‌స్థ‌ గుర్తించగలిగే పరిస్థితిలో కూడా లేద‌ని చెప్పారు. ఓ వైపు పాకిస్తాన్‌తో సత్సంబంధాలు లేక‌పోవ‌డంతో అక్కడి నుంచే సైబర్ దాడులు జరగుతున్నాయని భ్రమింపజేసేలా చైనా హ్యాకర్లు కొత్త‌రీతిలో హ్యాకింగ్‌కు పాల్ప‌డుతార‌ని చెప్పారు. ఈ తరహా దాడులను పసిగట్టే సామర్ధ్యం మనకి లేదని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు కొంత సమయం ఇచ్చి, సర్కారు నిధులను మంజూరు చేయాల్సి ఉంద‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News