: పోలింగ్ కేంద్రంలోనే ప్రసవం.. అనంతరం ఓటేసిన మహిళ!


కొన్ని సందర్భాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే ప్రసవించి, ఓటు వేసిన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... కెన్యాలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కెన్యాలోని వెస్ట్‌ పోకోట్‌ ప్రాంతానికి చెందిన పౌలినా చెమనంగ్‌ అనే మహిళ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది.

అయితే లైన్ లో నిల్చుని పోలింగ్ కేంద్రానికి చేరుకునే సరికి నిండు గర్భిణి అయిన చెమనంగ్ కు నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు సుఖప్రసవం జరిగింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అనంతరం మరోసారి పోలింగ్ కేంద్రానికి వచ్చి, ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంది.  

  • Loading...

More Telugu News