: బీజేపీలో ఇప్పుడున్న ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా గెలవడం కష్టమే: కేటీఆర్


2019 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారని తెలిపారు. హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. తెలంగాణలో టీడీపీ, వామపక్షాల ఉనికే లేదని చెప్పారు. బీజేపీలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు. హరీష్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య అన్ని విషయాల్లో క్లారిటీ ఉందని చెప్పారు.

ఈ ఏడాదే మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని... ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇసుక మాఫియాను అరికట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని... ఇసుక ద్వారా ఆదాయం పెరగడమే దానికి నిదర్శనమని చెప్పారు.

  • Loading...

More Telugu News