: దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు... 'బీజేపీ క్విట్ ఇండియా': మమతా బెనర్జీ
తెల్లవారి పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం అందించాలని గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు నిండిన విషయం తెలిసిందే. కాగా, భారతీయ జనతా పార్టీపై మండిపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా 'బీజేపీ క్విట్ ఇండియా' ఉద్యమం కోసం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని అన్నారు. ప్రజల హక్కులను బీజేపీ కాలరాస్తోందని, దేశంలో లౌకిక వాదం బలహీనపడిపోతోందని అన్నారు. అంతేగాక భారత్‌ను విభజించేందుకు బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని వ్యాఖ్యానించారు.