: గూగుల్ తొలగించిన ఇంజినీర్‌కి వికీలీక్స్ ఆశ్రయం... స్వయంగా వెల్లడించిన జూలియన్ అసాంజే!
`అమ్మాయిలు టెక్కీలుగా పనికి రారు` అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసి, పర్యవసానంగా ఉద్వాసనకు గురైన గూగుల్ ఉద్యోగి జేమ్స్ దామోర్‌కి తన దగ్గర ఉద్యోగం సిద్ధంగా ఉందని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన భావాలను వ్యక్తీకరించిన పాపానికి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం సబబు కాదంటూ ఈ అంశంపై రాసిన కొన్ని వ్యాసాలను, కార్టూన్లను ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఎంతకాలం ఈ కార్పోరేట్ పెట్టుబడిదారులు ఉద్యోగులను నోరు మూసుకుని పనిచేయమంటారని అసాంజే ప్రశ్నించాడు. లింగభేదం చూపిస్తూ వ్యాఖ్యలు చేసి కంపెనీ విధానాలను కాలరాసిన కారణంగా జేమ్స్ దామోర్‌ను గూగుల్ ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.