: సోష‌ల్ మీడియాలో మ‌హేశ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ వెల్లువ‌!


సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు 43వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చాలా మంది సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఇలా అన్ని ర‌కాల సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లోనూ మ‌హేశ్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

 ఈ సంద‌ర్భంగా ఆయ‌న విడుద‌ల చేసిన `స్పైడ‌ర్‌` సినిమా టీజ‌ర్‌ను కూడా వారు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రామ్‌, ఏఆర్ ముర‌గ‌దాస్‌, నాగార్జున‌, కొర‌టాల శివ‌, స‌మంత‌, వెన్నెల కిషోర్‌, మంచు లక్ష్మి, ద‌ర్శ‌కుడు మారుతి, అన‌సూయ, ప్ర‌ణీత‌, వంశీ పైడిప‌ల్లి సహా పలువురు ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేశారు. అనుష్క మాత్రం ఇన్‌స్టాగ్రాంలో `స్పైడ‌ర్‌` పోస్ట‌ర్ షేర్ చేసి మ‌హేశ్‌కి విషెస్ తెలిపింది

  • Loading...

More Telugu News