: మత్తు మందుల వాడకం నుంచి బయటపడ్డ డిస్కో శాంతి!
నటుడు శ్రీహరి ఆకస్మిక మరణం వల్ల కలిగిన బాధను భరించలేక తాను మత్తుకు బానిసైనట్లు, తర్వాత తన పిల్లల కోసం మత్తు వాడకం నుంచి బయటపడినట్లు శ్రీహరి భార్య డిస్కో శాంతి తెలియజేశారు. శ్రీహరి చనిపోయాక తిండి సరిగా తినకుండా, నిద్ర సరిగా పోకుండా మత్తులో మునిగిపోయినట్లు, అలా నెలలు, సంవత్సరాలు గడిచిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. మత్తు వాడకంలో మునిగిపోయిన తన దుస్థితి చూడలేక, తన కుమారుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడ డాక్టర్లు చెప్పిన మాటలు విని తాను మత్తు వాడకాన్ని వదిలేసినట్లు ఆమె వివరించారు. తాను కూడా లేకపోతే తన పిల్లలు ఏమైపోతారోనని మత్తు పదార్థాలను పూర్తిగా మానేసినట్లు డిస్కో శాంతి చెప్పారు.