: అన్నయ్య సినిమా... మొదటి రోజు మొదటి ఆటే..!: రానా సినిమాపై సమంత ట్వీట్
మరో రెండు రోజుల్లో దగ్గుబాటి రానా హీరోగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రం విడుదల అవుతున్న థియేటర్ల ముందు రానా లుంగీ కట్టుకుని నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉన్న భారీ కటౌట్లు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఓ భారీ కటౌట్ చిత్రాన్ని తన అభిమానులతో సమంత పంచుకోగా, నిమిషాల వ్యవధిలో వేల కొద్దీ లైక్ లు, వందల కొద్దీ రీ ట్వీట్లూ వచ్చాయి. ఈ ఫోటోతో పాటు, "ఊ..హూ... నా సూపర్ స్టార్ అన్నయ్య రానా చిత్రం. ఆగస్టు 11న ఫస్ట్ డే ఫస్ట్ షో" అని ట్వీట్ చేసింది. సమంత ట్వీట్ చేసిన భారీ కటౌట్ ఇదే.