: ఆస్ట్రేలియా ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ఆస్ట్రేలియా నిపుణులతో అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రతినిధులు తనను తమ దేశానికి వచ్చి పలు అంశాలను పరిశీలించాలని ఆహ్వానించారని లోకేశ్ చెప్పారు. ఈ భేటీలో ముఖ్యంగా పవర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన అంశాలు, డ్రోన్ టెక్నాలజీ గురించి చర్చించామని అన్నారు. ఈ సందర్భంగా వారితో చర్చల్లో పాల్గొంటుండగా తీసిన పలు ఫొటోలను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, హర్షం వ్యక్తం చేశారు.