: రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ ఫిర్యాదు.. నిలిచిపోయిన కౌంటింగ్
గుజరాత్‌లో రాజ్యసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. గుజరాత్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ నలుగురిలో భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్ సిన్హా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మద్ పటేల్ ఉన్నారు. అయితే, బ్యాలెట్ పేపర్ చూపించి ఓటు వేసిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించవద్దని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తమకు పోలింగ్ వీడియో ఇవ్వాలని కూడా కోరింది. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం 51కి పడిపోయింది.
పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్టు ప్రకటించడంతో ఆసక్తినెలకొంది. అంతేగాక, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే బీజేపీకే మద్దతు పలికారు. మరోవైపు జేడీయూ ఎమ్మెల్యే చోటూ వాసవ కూడా బీజేపీ నేతల ఎస్కార్ట్ మధ్యే పోలింగ్ కేంద్రానికి రావడతో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు 182. ప్రస్తుతం మాత్రం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో బీజేపీకి చెందిన వారి సంఖ్య 121. బీజేపీ మూడవ అభ్యర్థిగా రాజ్‌పుత్ ని నిలబెట్,టి ఆయనకు 48 ఓట్లు పడ్డాయని పేర్కొంటోంది. అహ్మద్ పటేల్ మాత్రం తనకు 45 ఓట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు.