: థ్యాంక్యూ రానా బ్రదర్.. మన ముగ్గురికీ ఆల్ ది బెస్ట్!: హీరో నితిన్
మరో మూడు రోజుల్లో జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమాతో పోటీ పడుతున్న జయ జానకి నాయక, లై సినిమాలకు రానా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న జయ జానకి నాయక, నితిన్ నటిస్తోన్న లై సినిమాలు మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
దీనిపై స్పందించిన నితిన్.. ‘థ్యాంక్యు సో మచ్ బ్రదర్... మన సినిమాలకి ఆల్ ది బెస్ట్’ అంటూ రిప్లై ఇచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ... మీకు కూడా ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొంది. ఈ మూడు సినిమాలపై తెలుగు సినీ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూడు సినిమాల్లో నటిస్తోన్న నటులు చేసుకున్న ఈ ట్విట్టర్ సంభాషణ అభిమానులను అలరిస్తోంది.