: డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు


డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సిట్ ద్వారా కాకుండా దర్యాప్తు సంస్థల ద్వారా ఈ కేసును విచారించాలని పిటిషన్ లో రేవంత్ కోరారు. నిందితులను అరెస్ట్ చేసే అధికారం సిట్ కు లేదని ఈ సందర్భంగా రేవంత్ తరపు లాయర్ వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ, ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అధికారాలు సిట్ కు ఉన్నాయా? లేవా? అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తామని లాయర్ తెలిపారు. దీంతో, వచ్చే వారానికి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 

  • Loading...

More Telugu News