: ఆ కేఫ్‌లో కాఫీ తాగితే స్త్రీలకంటే పురుషులకు బిల్లు ఎక్కువ పడుద్ది!
ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లోని ఓ కేఫ్‌లో కాఫీ తాగితే పురుషులకు ఎక్కువగా, స్త్రీలకు తక్కువగా బిల్ వేస్తున్నారు. ఆ కేఫ్‌లో ఇలా పురుషులకు వేస్తోన్న అధిక బిల్లు తమ లాభాల కోసం మాత్రం వేయడం లేదని చెబుతున్నారు. పురుషుల నుంచి అలా వసూలైన డబ్బును మహిళలకు సేవలందించే స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నామని తెలిపారు.
తాము విక్రయిస్తోన్న కాఫీ రేటుకి స్త్రీలకంటే పురుషుల నుంచి 18 శాతం ఎక్కువ బిల్లు వేస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే, ఈ అధికరేటు తప్పనిసరిగా కట్టాలని తాము డిమాండ్ చేయబోమని, పురుషులు వారికి నచ్చితేనే ఈ 18 శాతం అధిక బిల్లును చెల్లించవచ్చని చెబుతున్నారు. తమ కేఫ్‌లో కాఫీ తాగే పురుషుల్లో అధిక శాతం మంది ఆ అదనపు బిల్లు ఎందుకని అడగకుండానే చెల్లిస్తున్నారట.