: 40 లక్షలకు పైగా పన్ను ఎగవేసిన జగన్ కంపెనీ!


2012 నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరాల మధ్య వివిధ కంపెనీల ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై రూపొందించిన నివేదికను పార్లమెంటుకు కాగ్ సమర్పించింది. భారీగా ఆదాయం ఉండే కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను అడ్డం పెట్టుకుని కొన్ని కంపెనీలు అవకతవకలకు పాల్పడుతున్నాయని, ఆదాయపు పన్నును ఎగవేస్తున్నాయని ఈ సందర్భంగా కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇలాంటి కంపెనీల లిస్ట్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. వీటిలో వైసీపీ అధినేత జగన్ కు చెందిన భారతి సిమెంట్ కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

తమ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నాయంటూ భారతీ సిమెంట్ కొంత ఆదాయాన్ని తన లాభాల్లో చూపించలేదు. తద్వారా రూ. 40.63 లక్షల ఇన్ కమ్ ట్యాక్స్ ను చెల్లించలేదని కాగ్ తెలిపింది. ఇదే తరహాలో సోమా ఎంటర్ ప్రైజెస్ రూ. 98.24 కోట్లను సబ్ కాంట్రాక్టర్ కు చెల్లించకుండానే, చెల్లించినట్టు చూపెడుతూ రూ. 20.05 కోట్ల పన్నును ఎగవేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కూడా రూ. 20.31 కోట్లను చెల్లించలేదు.

  • Loading...

More Telugu News