: ముహూర్త సమయం: అమరావతి ప్రాంతంలో కిటకిటలాడుతున్న హోటల్ గదులు


నవ్యాంధ్ర నూతన రాజధాని శ్రావణమాసపు శుభవేళ, వివాహాల సందడితో కళకళలాడుతోంది. అమరావతికి అటూ, ఇటూ ఉన్న విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలిలోని చిన్న, పెద్ద హోటల్ గదులన్నీ ఫుల్ అయిపోయాయి. ఫంక్షన్ హాల్స్ నిండిపోయాయి. ఈ నెల 13, 15, 16 తేదీల్లో శుభముహూర్తాలు ఉండటంతో, ఏడడుగులూ నడిచి ఒకటి కావాలని భావిస్తున్న జంటలు తమ వివాహాలకు ఆ తేదీలనే ఎంచుకున్నారు.

విజయవాడలో 300 గదులను నిర్వహిస్తున్న మూడు ఫ్లోర్ల స్టార్ హోటళ్లతో పాటు, 650 గదులున్న 15 త్రీ స్టార్ హోటళ్లు, 2 వేల వరకూ గదులున్న చిన్న, పెద్ద హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా పెళ్లిళ్లకు సరైన కల్యాణ మండపాలు దొరకక, ఆరు బయట, పాఠశాలల మైదానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. మామూలుగా విజయవాడ, గుంటూరుల్లోని హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 70 శాతం వరకూ ఉంటుంది. కానీ తదుపరి వారం రోజులూ 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంటుందని ఆతిథ్య రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News