: సహనానికి చివరి అంచు ఇదే... ముందడుగేస్తే యుద్ధమే!: హెచ్చరించిన చైనా
చైనాతో యుద్ధం వచ్చే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆ దేశం మాటల దేశమే తప్ప చేతల దేశం కాదని భారత రక్షణ శాఖ అధికారి వ్యాఖ్యానించిన వేళ, చైనా స్పందించింది. తాము సహనానికి చివరి అంచున ఉన్నామని, మరొక్క అడుగు ముందుకేస్తే జరిగేది యుద్ధమేనని హెచ్చరించింది. ఈ మేరకు చైనా అధికార 'గ్లోబల్ టైమ్స్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, యుద్ధం వస్తే ఏం జరుగుతుందన్న సంగతి ఇండియాకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది.
ఆర్థిక వ్యవస్థా పరంగా ఇండియా చాలా బలహీనమైన దేశమని, తమను ఎదుర్కొనేంత బలం, బలగం ఆ దేశానికి లేవని అభిప్రాయపడింది. కాగా, డోక్లామ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మధ్య కొన్ని వందల మీటర్ల దూరం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున జవాన్లతో పాటు యుద్ధ ట్యాంకులు, తేలికపాటి క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లు ఇక్కడ మోహరించి ఉండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొని ఉన్నాయి.