: భర్తకు వెన్నుదన్నుగా నిలిచే గృహిణి పాత్ర చేశాను!: కాజల్
తన కొత్త చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'లో తనది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అని హీరోయిన్ కాజల్ వ్యాఖ్యానించింది. తన తొలి చిత్రం 'లక్ష్మీ కల్యాణం'లో లక్ష్మి పాత్రకు, 50 సినిమాల తరువాత చేస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి'లోని రాధ క్యారెక్టర్ కూ ఎంతో తేడా ఉందని చెప్పుకొచ్చిందీ అందాల భామ. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ చిత్రంలో రాధ లేకపోతే జోగేంద్ర ఏమీ చేయలేడని అంటోంది. రాధలో నమ్మకం, మానసిక స్థైర్యం ఎంతో అధికమని, గృహిణి అయినా, భర్తకు వెన్నుదన్నుగా నిలిచి అన్నింటా తోడుంటుందని చెప్పింది. ఈ చిత్రానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ, పూర్తి రాజకీయ చిత్రం కాదని, ప్రేమ, భార్యాభర్తల బంధం, వారి జీవన ప్రయాణం తదితరాలను ఎన్నింటినో చేర్చారని కాజల్ వెల్లడించింది.