: జీఎస్టీ పన్ను రేట్లలో అవకతవకలు... 20 వస్తువులపై తగ్గే రేటు!


ప్రజలు నిత్యమూ వాడే 20 రకాల వస్తువులపై జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) తగ్గనుంది. ఈ వస్తువుల పన్ను రేట్లను నిర్ణయించిన వేళ, కొన్ని అవకతవకలు జరిగాయని తేల్చిన ఫిట్ మెంట్ కమిటీ, వాటిని సరిదిద్దాలని వస్తు సేవల పన్ను మండలికి సూచించగా, దీనిపై వచ్చే నెల 9న హైదరాబాద్ లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ప్రస్తుతం బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం పన్ను ఉండగా, అన్ బ్రాండెడ్ వస్తువులపై పన్ను లేదన్న సంగతి తెలిసిందే. దీంతో పన్ను భారాన్ని తప్పించుకునేందుకు తమ ప్రొడక్టులను బ్రాండెడ్ జాబితా నుంచి పలు కంపెనీలు ఉపసంహరించుకుంటున్నాయి. ఇదే విషయమై ఆలోచనలో పడ్డ కేంద్రం మే 15 నాటికి ఏ ఆహార ఉత్పత్తులైతే బ్రాండెడ్ జాబితాలో ఉంటాయో వాటన్నింటిపైనా 5 శాతం పన్ను కొనసాగేలా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News