: తన పెళ్లిపై వార్తలను ఖండించిన శింబు... మీడియాపై ఆగ్రహం!
ప్రముఖ తమిళ నటుడు శింబు కోలీవుడ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ లో పాల్గొంటున్న నటి ఓవియా హెలెన్ ను శింబు వివాహం చేసుకోబోతున్నాడంటూ గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెను దుమారం రేగింది. ఓవియాతో వివాహం అంటూ వచ్చిన వార్తలు తనని షాక్ కు గురిచేశాయని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ అబద్ధమని, ఈ విషయంలో మీడియా తనను కనీసం సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.