: రోజాగారూ! అంత గౌరవం ఉంటే... మా నాన్న పోయినప్పుడు ఎందుకు రాలేదు?: అఖిల ప్రియ
'రోజాగారు, మీకు నా తల్లిపై గౌరవం ఉంటే, మా తండ్రి మరణించినప్పుడు శవాన్ని చూసేందుకు ఎందుకు రాలేదు?' అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏపీ మంత్రి అఖిల ప్రియ ప్రశ్నించారు. తన తండ్రిపై విమర్శలు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారని ఆమె అడిగారు. తానెప్పుడూ జగన్ ను విమర్శించలేదని ఆమె అన్నారు. తామిప్పటికీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను గౌరవిస్తున్నామని తెలిపారు.
తమ పోరాటం జగన్ పార్టీపై కాదని, శిల్పా మోహన్ రెడ్డిపై అని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రిని ఎన్నో విధాలుగా ఇబ్బందిపెట్టిన శిల్పా మోహన్ రెడ్డిపై పోరాడితే, దానిని మీరు వ్యతిరేకంగా తీసుకోవడం కరెక్టు కాదని ఆమె హితవు పలికారు. ఎవరో ఏవో విమర్శలు చేశారని, తమపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.