: సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ నష్టాలపై అసెంబ్లీలో చర్చించకుండా బిల్లును ఆమోదించిన కేసీఆర్, ఇప్పుడు జీఎస్టీ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే అప్పట్లో కేంద్రానికి కేసీఆర్ మద్దతిచ్చారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను సీబీఐ రెండు సార్లు విచారించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు విషయాన్ని తాము బయటపెట్టడంతో జీఎస్టీపై కేసీఆర్ కొత్తడ్రామాకు తెరతీశారని ఆయన విమర్శించారు.