: 'రాజకీయాలు నాకు ఇష్టమే' అంటూ పార్లమెంటులో కలియదిరిగిన సినీ నటి అంజలి!
'నాకు రాజకీయాలు ఇష్టమే' అంటూ పార్లమెంటులో సినీ నటి అంజలి కలియదిరిగింది. తమిళ సినిమాలతో పేరుతెచ్చుకుని, టాలీవుడ్ లో కూడా సక్సెస్ అయిన తెలుగమ్మాయి అంజలి అకస్మాత్తుగా పార్లమెంటులో ప్రత్యక్షమైంది. జమ్మూకశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్లిన అంజలి... త్రికూట పర్వతాల్లో కత్రా నుంచి 13.5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంది.
తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో దిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. అంజలి సందర్శనకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏర్పాట్లు చేశారు. గీత దగ్గరుండి పార్లమెంటును అంజలికి చూపించడం విశేషం. ఈ సందర్భంగా అంజలి తనకు రాజకీయాలు అంటే ఇష్టమేనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంది.