: శిల్పా మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిల నామినేషన్ లను ఆమోదించిన ఈసీ
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్లపై టీడీపీ, వైఎస్సార్సీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడు దాఖలు చేసిన నామిషన్ కూడా చెల్లదని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్ నామినేషన్లను ఆమోదించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించింది. దీంతో రెండు గంటలకు పైగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది.