: కరణ్ జొహార్ కవలలు వీళ్లే!
బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ తన కవల పిల్లల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. సర్రోగసీ విధానం ద్వారా జన్మించిన ఈ పిల్లల ఫొటోలను రక్షా బంధన్ సందర్భంగా కరణ్ పోస్ట్ చేశాడు. రూహి, యష్ అని వాళ్ల అమ్మనాన్నల పేర్లు కలసి వచ్చేలా కవలలకు కరణ్ నామకరణం చేశారు. ప్రస్తుతం ఆరు నెలల వయసున్న వారు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారని ట్విట్టర్ లోకం కొనియాడుతోంది. సింగిల్ పేరెంట్‌గా తన పిల్లల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కరణ్ ఇటీవల వోగ్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. తన కూతురిని మొదటిసారి ఎత్తుకున్నపుడు తనకు తెలియకుండానే కళ్లలోంచి నీళ్లు వచ్చినట్లు కరణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే!