: ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు కుమార్తె ఏం చెప్పిందంటే..!


టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ పెళ్లి అభిమానుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న సంగతి విదితమే. అయితే, ప్రభాస్ మాత్రం తన పెళ్లి గురించి ఏమీ చెప్పడం లేదు. బాహుబలి-3 పూర్తయిన తరువాత వివాహం గురించి ఏదో ఒకటి చెబుతానని గతంలో చెప్పాడు. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండో కుమార్తె సాయి ప్రకీర్తి మీడియాతో మాట్లాడింది. తాము ముగ్గురు అక్కాచెల్లెళ్లమని, తన అక్క పేరు సాయి ప్రసీద, చెల్లి పేరు సాయి ప్రదీప్తి అని చెప్పింది. ప్రతి రాఖీ పండుగకు అన్నయ్య ప్రభాస్ కు తాము ముగ్గురమూ రాఖీలు కడతామని చెప్పింది.

ఆ వెంటనే అన్నయ్య ఏదోఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పింది. తామేదడిగినా అన్నయ్య కాదనడని తెలిపింది. అలాంటి అన్నయ్య... పెళ్లి ప్రస్తావన తెస్తే మాత్రం ఏదోఒకటి చెప్పి దాటవేస్తాడని తెలిపింది. తామేమో అన్నయ్య పెళ్లి ఎప్పుడవుతుందా? అని ఎదురు చూస్తున్నామని చెప్పింది. అన్నయ్య పెళ్లిలో సందడి చేయాలని చూస్తున్నామని, అన్నయ్య పెళ్లి సంగీత్ లో డాన్స్ వేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపింది. అన్నయ్య పెళ్లిలో మంచి ఫుడ్ ఉంటుందని, అంతా ఎంజాయ్ చేయొచ్చని సాయి ప్రకీర్తి ఊరించింది. అన్నయ్యకి పెళ్లి కుదిరితే తమకంటే సంతోషించేవారు మరొకరుండరని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News