: తమ ఆప్యాయతను ప్రదర్శించేందుకు చంద్రబాబు వద్ద క్యూ కట్టిన మహిళా నేతలు


రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబుకు తమ ఆప్యాయతను తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఈ ఉదయం ఆయన నివాసం వద్ద క్యూ కట్టారు. మంత్రి పరిటాల సునీత సహా, ఏపీ, తెలంగాణ మహిళా నేతలు పీతల సుజాత, గద్దె అనూరాధ, సీతక్క తదితరులు చంద్రబాబుకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు ప్రతీక రాఖీ అని, భారతదేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని అన్నారు. భారత దేశ సంస్కృతిని ఇటువంటి పండుగలే కాపాడుతున్నాయని అన్నారు. భావి తరాలకు సంస్కృతిని అందించేందుకు యువత పూనుకోవాలని పిలుపునిచ్చారు. రక్షాబంధన్ తో ప్రతి ఒక్కరిలో సామాజిక చైతన్యం రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News