: అంకుల్ పెర్సీకి అరుదైన కానుకను ఇచ్చిన విరాట్ కోహ్లీ టీమ్


పెర్సీ... శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు, క్రీడాభిమానులు ముద్దుగా అంకుల్ పెర్సీ అని పిలుచుకుంటారు. ఆయన వయసు 81 సంవత్సరాలు కాగా, ఆయన పేరు తెలియని లంక క్రికెటర్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ పెర్సీ ఎవరో గుర్తొచ్చిందా? భారత క్రికెట్ జట్టు ఎక్కడ ఆడుతున్నా ఓ చేత్తో త్రివర్ణ పతాకం, మరో చేత్తో శంఖం పట్టుకుని గ్యాలరీలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచే సుధీర్ తెలుసుగా?... అదే మాదిరిగా శ్రీలంకకు పెర్సీ!

ఇక భారత జట్టుకు కూడా పెర్సీ అంటే అభిమానం. నిన్న ముగిసిన రెండో టెస్టులో శ్రీలంకపై భారత జట్టు చిరస్మరణీయమైన విజయం సాధించగా, ఈ మ్యాచ్ కి కూడా పెర్సీ వచ్చాడు. త్వరలో 82వ పుట్టిన రోజు జరుపుకోనున్న పెర్సీకి ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ, ధావన్ తదితరులు ఆటగాళ్లతో పాటు కోచ్ రవిశాస్త్రి ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు.  దీంతో పెర్సీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News