: నన్ను, ధనుష్ ను ఎంతో టార్చర్ చేశారు: హీరోయిన్ అమలాపాల్
హీరో ధనుష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అతనితో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది. లేనిపోని వదంతులతో తనను, ధనుష్ ను టార్చర్ చేశారని తెలిపింది. ధనుష్ తో నటిస్తే తనకు మంచి అనుభవం వస్తుందని, ఆయన చాలా హార్డ్ వర్కర్ అని చెప్పింది. నటనలో ధనష్ తో తనకు మంచి పోటీ ఉంటుందని తెలిపింది.
సుచీలీక్స్ లో ధనుష్ కు, తనకు మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగిందని... వాస్తవానికి సుచీ లీక్స్ తో సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారని తెలిపింది. వ్యక్తిగతంగా సుచిత్ర తనకు చాలా మంచి స్నేహితురాలు అని చెప్పింది.