: ద గ్రేట్ ఖ‌లీని క‌లిసిన భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్‌... ట్విట్ట‌ర్లో కామెంట్ల వ‌ర్షం!


వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ)లో త‌న ప్ర‌ద‌ర్శ‌న ద్వారా భార‌త్‌కు గుర్తింపు తెచ్చిన మ‌ల్ల‌యోధుడు ద గ్రేట్ ఖ‌లీని భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క‌లిశారు. ఆయ‌న‌తో దిగిన ఫొటోను విరాట్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. భారీ శ‌రీరాకృతితో క‌నిపించే ఖ‌లీ ప‌క్క‌న విరాట్ నిల్చుని ఫొటో దిగాడు. ఈ ఫొటోకు ట్విట్ట‌ర్‌లో విరాట్ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. `ఖ‌లీ ప‌క్క‌న నువ్వొక చిన్న పిల్లాడిలా ఉన్నావ్‌!`, `నీ టీమ్‌కు ఖ‌లీ అంత పెద్ద బౌల‌ర్ అవ‌స‌రం!` అంటూ అభిమానులు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News