: బిగ్‌బాస్ నుంచి సమీర్ అవుట్.. హౌస్‌లో సందడి చేసిన రానా!


ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షోలో టాలీవుడ్ హీరో రానా దర్శనమిచ్చి బుల్లితెర అభిమానులను అలరించాడు. రానా నటించిన ‘నేనే రాజు.. నేనే మంత్రి ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చాడు. అతడిని చూసిన 12 మంది సెలబ్రిటీల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అతిథి మర్యాదలు చేసేందుకు ఎగబడ్డారు.

 ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రానా ఆధ్వర్యంలో  హౌస్‌లో ఉన్న పోటీ దారులకు ఎన్టీఆర్ సరదాగా ఓ పోటీ పెట్టాడు. నచ్చిన వాళ్లకు పసుపు గులాబీ, నచ్చని వాళ్లకు నల్లని గులాబీ ఇవ్వాలని, ఆ పూలు ఎందుకు ఇస్తున్నారో ఒక్క వాక్యంలో చెప్పాలని అన్నారు. చివర్లో, బిగ్‌బాస్ హౌస్ నుంచి సమీర్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్టు రానా చదివి వినిపించాడు.

  • Loading...

More Telugu News