: వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేస్తా: టీజీ వెంకటేష్ కుమారుడు భరత్
వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ తెలిపారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందిస్తూ, వచ్చే ఎన్నికల్లో తాను ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని, మరి, టీజీ భరత్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో తెలియదని ఆయన చెప్పడం గమనార్హం.