: ఖగోళ జ్యోతిష్య శాస్త్రం అబద్ధమని నిరూపిస్తే 25 లక్షలు ఇస్తా: ప్రముఖ జ్యోతిష్కుడు మన్నెం సవాల్
ఖగోళ జ్యోతిష్య శాస్త్రం అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే, వారికి రూ. 25 లక్షల బహుమతిని ఇస్తానని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మన్నెం గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. గ్రహాల ఆధారంగా రూపొందినదే ఖగోళ జ్యోతిష్య శాస్త్రమని చెప్పిన ఆయన... ఉస్మానియా యూనివర్శిటీ కూడా ఈ విషయాన్ని ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్నది రాజుల కాలం నాటి జ్యోతిష్యమని... దీని పేరు చెప్పుకొని కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఖగోళ జ్యోతిష్య శాస్త్రంపై చర్చకు రావాలనుకునేవారు 9912492171 నంబరుకు ఫోన్ చేయాలని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన కలిగిస్తూ, యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ, వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.