: రోజా.. నీ క్యారెక్టర్ ఏంటి?: టీడీపీ ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ, మహిళలు సిగ్గుపడేలా కామెంట్లు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. రోజా, నీ క్యారెక్టర్ ఏంటి? నీవా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేది? అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని... అలా కాకుండా చంద్రబాబుపై, లోకేష్ పై అవాకులు, చెవాకులు పేలుతూ ఉంటే జనాల్లో తిరగలేవు అని హెచ్చరించారు. టీడీపీ మహిళల దెబ్బకు నీకు దిమ్మ తిరిగిపోతుంది అని అన్నారు.