: ఆపిల్ వినియోగదారులకు శుభవార్త.. ఐఫోన్ ఎస్ఈపై రూ.7 వేలు తగ్గించిన పేటీఎం!


ఆపిల్ వినియోగదారులకు పేటీఎం ఆన్‌లైన్ మాల్ శుభవార్త చెప్పింది. ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈపై భారీ రాయితీ ప్రకటించింది. తాజా రాయితీతో రూ.27,200 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.19,990కే దక్కించుకునే అద్భుత అవకాశం భారతీయ వినియోగదారులకు లభించింది. ఈఫోన్ అసలు ధరపై ప్లాట్ 15 శాతం ఆఫర్ ప్రకటించి రూ. 22,990కే విక్రయిస్తున్న పేటీఎం తాజాగా ఆ ధరకు మరో రూ.3 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అంటే మొత్తం ధరపై ఏకంగా 7 వేలు తగ్గి రూ.19,990కే ఈ ఫోన్ అందుబాటులో ఉందన్నమాట. అంతేకాదు, రూ.9 వేల బై బ్యాక్ గ్యారెంటీని కూడా ప్రకటించింది. ఈ ఫోన్‌లో 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్ క్యాష్ ఆన్ డెలివరీకి వర్తించదని పేటీఎం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News