: ఇరు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!


ఇరు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తుందని, ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు పెరుగుతాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News