: ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!


ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు బిల్లును నిన్న లోక్ సభ ఆమోదించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) పేరుతో ఈ యూనివర్శిటీ ఏర్పాటుకానుంది. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి, దేశానికే కాకుండా ప్రపంచానికే ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖ నగరాన్ని ఆయన 'ఇండియన్ హ్యూస్టన్'గా అభివర్ణించారు. ఈ సంస్థ ఏర్పాటుకు విశాఖనే అనువైన ప్రాంతం అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News