: జైల్లో విక్రం గౌడ్ ను చూసి, కన్నీటిపర్యంతం అయిన షిపాలీ!


కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను భార్య షిపాలీ, బావమరిది అనిరుధ్ రెడ్డిలు జైల్లో కలిశారు. ముందుగా వీరు ఈ-ములాఖత్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా, తన భర్తను చూసిన షిపాలి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు, విక్రం గౌడ్ ను కలిసేందుకు కమెడియన్ నర్సింగరావు కూడా జైలు వద్దకు వచ్చాడు. అయితే, ఆయనను లోపలకు అనుమతించలేదు.

  • Loading...

More Telugu News