: ప్రిన్సెస్ డయానా ప్రైవేట్ టేపులను రేపు విడుదల చేయనున్న బ్రిటన్ చానెల్!


సుమారు ఇరవై ఏళ్ల క్రితం బ్రిటన్ యువరాణి డయానా అనుమానాస్పదస్థితిలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. డయానా వ్యక్తిగత లైంగిక జీవితం, వివాహాం తర్వాత ప్రిన్స్ చార్లెస్ పట్ల అసంతృప్తి మొదలైన అంశాలతో కూడిన ఆమె ప్రైవేట్ టేపులను విడుదల చేసేందుకు బ్రిటన్ కాస్టర్ చానెల్ 4 సిద్ధంగా ఉంది. టీవీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్న ఈ ప్రైవేట్ టేపులను రేపు బయటపెట్టనుంది.

చార్లెస్ కు, డయానాకు మధ్య ఏడేళ్లపాటు శృంగార జీవితం లేదనే విషయం ఈ టేపుల్లో ఉందని, ప్రిన్స్ హ్యారీ పుట్టిన తర్వాత డయానా, చార్లెస్ మధ్య దూరం ఎలా పెరిగిందనే విషయాలు రేపు విడుదల కానున్న ప్రైవేట్ టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ టేపులను విడుదల చేయవద్దని బ్రిటన్ రాజకుటుంబంతో పాటు, డయానా కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరినప్పటికీ, సదరు టీవీ చానెల్ పట్టించుకోలేదని సమాచారం.

  • Loading...

More Telugu News