: ముద్రగడ తీరు వింతగా ఉంది.. జగన్ ఆడించినట్టు ఆడుతున్నారు!: ఏపీ మంత్రి నారాయణ
ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో కాపుల గురించి ఎంతమాత్రం ప్రస్తావించని జగన్ ను ముద్రగడ పద్మనాభం ఎందుకు ప్రశ్నించరని, ఆయనకు ఎందుకు లేఖ రాయలేదని ఏపీ మంత్రి నారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముద్రగడ తీరు వింతగా ఉందని, జగన్ ఆడించినట్టు ఆయన ఆడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాపుల స్థితిగతులపై అధ్యయనం చేస్తామంటే, కనీసం రూ.25 లక్షలు కూడా ఇవ్వలేదని; వైఎస్ హయాంలోను, తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ కాపు సమస్యలపై మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని నారాయణ ప్రశ్నించారు.