: తిరుమలలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి!: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు
తిరుమలలో ఇనుప మెట్ల నిర్మాణం ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏమీ లేదని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అన్నారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రద్దీ సమయంలో తొక్కిసలాటను నివారించేందుకే మెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పుడు మాత్రమే వాటిని వినియోగిస్తామని చెప్పారు. విమానాల్లో ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తరహాలో ఈ ఇనుపమెట్ల నిర్మాణం జరిగిందని, రద్దీ సమయాల్లో తిరుమలకు ఎలాంటి అపప్రధ రాకుండా ఉండేందుకే ఈ మెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
తిరుమలలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నారని, అపచారాలు జరుగుతున్నాయని.. మహాలఘు దర్శనం వద్దని, పవిత్రోత్సవాల్లో విమాన గోపురం పైకి పండితులు కాకుండా మిగతావారు ఎక్కడం విరుద్ధమని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. తిరుమలకు భక్తుల రాక పతాకస్థాయికి చేరిందని, యుగధర్మం పాటించకపోతే కాలజ్ఞానం ప్రకారం ఆలయం వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ విషయాలన్నింటిని సీఎం చంద్రబాబునాయుడుకి వివరించినట్టు రమణ దీక్షితులు చెప్పారు.