: గర్వపడేలా చేసిన ఈ అమ్మాయిలను కలవడం ఆనందంగా ఉంది: వీరేంద్ర సెహ్వాగ్


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ లో అద్భుతంగా ఆడి రన్నర్స్ గా నిలిచిన భారత మహిళా జట్టులోని పలువురు క్రీడాకారిణులను వీరేంద్ర సెహ్వాగ్ కలిశాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన డాషింగ్ మాజీ ఓపెనర్... ‘మనల్ని ఎంతో గర్వపడేలా చేసిన ఈ అమ్మాయిలను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొన్నాడు. సెహ్వాగ్ కు వీరాభిమాని అయిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్టార్ పేసర్ జులన్‌ గోస్వామి, స్టార్ బ్యాట్స్ ఉమన్ వేద కృష్ణమూర్తి, స్పిన్నర్స్ ఏక్తా బిస్త్‌, పూనమ్‌ రౌత్‌, రాజేశ్వరి గైక్వాడ్‌ లు సెహ్వాగ్ ను కలిశారు. 

  • Loading...

More Telugu News