: ప్రేమ ముందు డబ్బు ఓడిపోయింది... ప్రియుడి కోసం కోట్లాది ఆస్తిని త్యజించిన యువతి!


డబ్బు కోసం ఎలాంటి బంధాలనైనా వదులుకుంటున్న ఈ రోజుల్లో ప్రేమ కోసం వేల కోట్ల రూపాయలు వదులుకోవడం సాధ్యమా? సినిమాల్లో అయితే సాధ్యమే... కానీ నిజజీవితంలో కూడా సాధ్యమని నిరూపించింది మలేసియా యువతి. ఆ వివరాల్లోకి వెళ్తే... మలేసియాలో ఖూకే పెంగ్ బిజినెస్ టైకూన్. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ఆయన. ఆయన భార్య మాజీ మిస్ మలేసియా పౌలిన్ ఛై. ఆ దంపతులకు ఐదుగురు సంతానం. అందర్లోకి చిన్న కుమార్తె ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ, జెడిడియా అనే ఫ్యాషన్ డిజైనర్‌ ను ప్రేమించింది. వారి వివాహానికి తల్లి అంగీకారం తెలిపినా, తండ్రి మాత్రం వ్యతిరేకించారు. తన ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని తేల్చిచెప్పారు. దీంతో వారిని ధిక్కరించి, ప్రియుడిని వివాహం చేసుకుంది.

 ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఆమె తరపువారెవరూ హాజరుకాకపోవడం విశేషం. ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా, తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారు కోర్టు కెక్కారు. దీంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాలు కోరింది. దీంతో ఏంజెలినాకు కూడా వాటాగా వేల కోట్ల రూపాయలు వచ్చాయి. అప్పటికి కానీ ఏంజెలినా భర్త జెడిడియాకు తన భార్య ఎంత ధనవంతురాలో తెలియరాలేదు. తన కోసం అంత త్యాగం చేసిన భార్యను చూసుకుని ఇప్పుడు మురిసిపోతున్నాడు. వీరి ప్రేమకథ ఈమధ్యే వెల్లడికాగా, వారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వారి ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News