: ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ.. సిట్ ఏర్పాటు!


ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. సిట్ పర్యవేక్షకుడిగా విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ వ్యవహరించనున్నారు. కాగా, 2007లో  విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.  

  • Loading...

More Telugu News