: జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన అఖిల ప్రియ
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్ పై మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదు చేశారు. నంద్యాల బహిరంగ సభలో తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబును కాల్చిచంపాలన్న జగన్ వద్ద తుపాకులేమైనా ఉన్నాయనే అనుమానం ఉందని, చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. జగన్ వ్యాఖ్యలతో నంద్యాల ప్రజలు భయపడుతున్నారని, జగన్ కు, రోజాకు పిచ్చిపట్టిందని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.